ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుకు తిరుమల వేంకటేశ్వర స్వామి అంటే అపార నమ్మకం. అందుకే తన స్వగ్రామంలో ఆయన వేంకటేశ్వరస్వామి కోవెలను నిర్మించారు. అలానే తాను నిర్మించిన ప్రతి చిత్రం విడుదల కాగానే తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పించి, స్వామిని దర్శించుకుని రావడమన్నది ‘దిల్’ రాజు కు కొన్నేళ్ళుగా ఉన్న అలవాటు. తాజాగా ఆయన అన్న నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం కూడా మొదలు పెట్టారు. ఇలా ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యాన్ని ‘మా…