టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ మరోసారి నటుడిగా లీడ్ రోల్‌లో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. జనవరి 23న రిపబ్లిక్ డే వీకెండ్‌లో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ టీజర్‌లోని కథ, అహంకారం, స్వార్థపూరిత స్వభావం గల ధనవంతుడైన చేపల వ్యాపారి అంబటి ఓంకార్ నాయుడు చుట్టూ తిరుగుతుంది.…