హైదరాబాద్ పాతబస్తీ మీర్‌చౌక్ ఆఘా కాలనీలో దారుణ హత్య కలకలం రేపుతోంది. ఓ ఇంట్లో షేక్ వాజిద్ అనే వ్యక్తిని నిసార్ అహ్మద్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, మీర్ చౌక్ ఏసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. హత్యకు గల కారణాలు ఆర్థిక లావాదేవీలే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.