అగ్రనేతల ఎఫైర్స్ వైసీపీకి తలపోటుగా మారుతున్నాయా? ఒకరు కాదు… ఇద్దరు కాదు… వరుసబెట్టి కీలక నేతలంతా ఎఫైర్స్ ఎపిసోడ్స్‌లో చిక్కుకోవడం పార్టీ కేడర్ని సైతం ఇరుకున పెడుతోందా? వీళ్ళ చేష్టలతో బయట తలెత్తుకోలేకపోతున్నామని కేడర్ తలలు పట్టుకుంటోందా? నాయకులంటే అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడం సహజం కానీ ఇక్కడ వస్తున్నవన్నీ పరువు తక్కువ విషయాలు కావడం అగ్ర నాయకత్వానికి కూడా చికాకుగా మారిందా? ఈ ఎపిసోడ్ లో ఎవర్ని ఏం అనాలో తెలియక వైసీపీ పెద్దలు సైలెంట్‌గా…
వైసీపీ పదవులకు రాజీనామా చేసిన ఆ నాయకుడిది వ్యూహమా? లేక వైరాగ్యమా? పార్టీలోనే కొనసాగుతూ…. జిల్లా అధ్యక్ష పదవికి మాత్రం రాజీనామా చేయడాన్ని ఎలా చూడాలి? పవర్లో లేని పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? లేక ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకుంటున్నారా? ఎవరా నాయకుడు? ఇలాంటి వ్యవహారాల్లో ఆయన గతం ఏం చెబుతోంది? ఏపీలో పొలిటికల్‌గా కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏలూరు ఒకటి. ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్…
జాతీయ రాజకీయాల్లో వైసీపీ కొత్త దారులు వెదుక్కుంటున్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం బీజేపీతో అంటకాగి, ఆ పార్టీ ఆడించినట్టు ఆడి... ఏది చెబితే దానికి ఓకే చెప్పేసింది వైసీపీ. పార్టీలే వేరు కానీ... బీజేపీ నేతలు మేం వేరు కాదన్నట్టు జాతీయ స్థాయిలో వ్యవహరించింది వైసీపీ. ఒకట్రెండు సందర్భాల్లో మినహా ఎక్కువ, కీలక అంశాల్లో కాషాయ దళానికి ఉభయ సభల్లో బాసటగా నిలిచింది. అలాంటి వైసీపీ... ఓడిపోయాక రూట్ మార్చేసినట్టు కనిపిస్తోందట.
విజయనగరం ఎంపీగా తొలిసారి గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు నిత్యం ప్రజల్లో ఉండాలని అనుకోవడం వరకు బాగానే ఉందిగానీ... అందు కోసం ఆయన చేస్తున్న స్టంట్స్ పరువు తీసేస్తున్నాయన్న టాక్ బలంగా ఉందట నియోజకవర్గంలో. చిన్నచిన్న విషయాలను సాతం తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పడుతున్న తాపత్రయంతో మొత్తం బూమరాంగ్ అవుతోందన్న అంచనాలు పెరుగుతున్నాయి.