ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్లకు ఓ విజ్ఞప్తి చేసింది. డెలివరీ బాయ్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలు భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఆర్డర్లు పెట్టొద్దని సోషల్ మీడియా వేదికగా కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది.