బాలీవుడ్ కండల వీరుల్లో మేటి అనిపించుకున్న జాన్ అబ్రహామ్ హీరోగా మెప్పించడమే కాదు, నిర్మాతగా, కథకునిగానూ రక్తి కట్టించాడు. జాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎటాక్’కు ఆయనే కథకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘ఎటాక్-2’ తీస్తే అందులో తనతో పాటు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తే ఈ సారి బంపర్ హిట్ ఖాయమని ఈ మధ్యే చెప్పాడు. ఇప్పుడు తన మనసులోని మరో కోరికను…