తెలంగాణ BJP అనుబంధ విభాగాలు ఉన్నాయి. ఈ అనుబంధ మోర్చా లన్నింటికి కమిటీలు కూడా ఉన్నాయి. యువజన మోర్చ, మహిళా, కిసాన్, దళిత, గిరిజన, OBC, మైనార్టీ మోర్చా లు BJPకి ప్రధాన అనుబంధ విభాగాలు. అయితే… ఇందులో కొన్ని మోర్చాలు తమ పరిధిలో జరుగుతున్న వ్యవహారాన్ని అస్సలు పట్టించుకోవడం లేదట. పార్టీ చెప్పేంత వరకు కనీసం స్పందించడం లేదట. తాము ఉన్నామని చెప్పుకునేందుకు ఏదో పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలు అప్పడప్పుడు చేస్తున్నారని లోకల్ టాక్. ప్రధానంగా…
తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం పెంచిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్. బీసీ, ఈబీసీ, డీఎన్ టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయాన్ని పెంచడంపట్ల తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కే. కిశోర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఓబీసీ, ఈబీసీ స్కాలర్ షిప్స్ కి విద్యార్థుల కుటుంబ ఆదాయ పరిమితి పెంచింది. వార్షిక ఆదాయం పరిమితి రెండున్నర లక్షలకు పెంచారు. పోస్ట్…
వైద్యవిద్యా కోర్సులకు సంబందించి రిజర్వేషన్లను కేంద్రం ఖరారు చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కేంద్రం పేర్కొన్నది. యూజీ, పీజీ, దంతవైద్య విద్యాకోర్సులకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని అన్నారు. 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. దేశంలో సామాజిక న్యాయంలో కొత్త అధ్యాయనం మొదలైందని ప్రధాని మోడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏడాది కాలంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చినట్టు ప్రధాని తెలిపారు. వైద్యవిద్యలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్…