హైదరాబాద్‌లో ప్రతి ఏడాది జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి నిర్వాహకులు శుభవార్త అందించారు. జనవరి 1నుంచి 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్ తమిళిసై నుమాయిష్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని ఆరు ఎకరాల్లో 1500 స్టాళ్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. నో మాస్క్ నో ఎంట్రీ రూల్‌ను అమలు చేస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. Read Also: సమోవా దీవిలో…
కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది నుమాయిష్ నిలిచిపోయింది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది నుమాయిష్‌ను నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బి.ప్రభాశంకర్ పేర్కొన్నారు. నుమాయిష్‌కు జీహెచ్ఎంసీ, పోలీసు, ఫైర్ సర్వీసెస్, విద్యుత్, రోడ్ల భవనాల శాఖల నుంచి…