మేషం :- ఆలయాలను సందర్శిస్తారు. మీ బాధ్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందు లెదుర్కుంటారు. ఉన్నత విద్యా, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. వితండవాదాలు, హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వృషభం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. చిన్నతరహా, చిరు వ్యాపారులకు ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పడు. పరిశోధకులకు గణిత, సైన్సు ఉపాధ్యాయులకు…