ఎన్టీఆర్ వీరాభిమాని, టీడీపీ సీనియర్ నాయకులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రామచంద్రరాజు (ఎన్టీఆర్ రాజు) ఈరోజు ఉదయం కన్నుమూశారు. తిరుపతిలోని తన నివాసంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్టీఆర్ రాజు మరణంతో టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. మహానేత ఎన్టీఆర్ గారిపై ఉన్న అపారమైన అభిమానంతో ఆయన…