మార్చ్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లాల్సిన ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఓపెనింగ్ సెరిమొని ఈ ఫిబ్రవరి 24న జరగాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే లేట్ అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ సెరిమొనిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నందమూరి తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలని పోస్ట్ పోన్ చేశారు. కొత్త డేట్ త్వరలో అనౌన్స్ చేస్తామంటూ పీఆర్వో వంశీ కాకా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్,…
23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. తారకరత్నకి నివాళులు అర్పించిన దర్శకుడు అనీల్ రావిపూడి… “తారకరత్న ఇంత చిన్న వయసులో మరణించడం బాధాకరం. #NBK108 సినిమాలో తారకరత్నకి మంచి పాత్రని ఇవ్వాలని బాలయ్య అడిగారు. మేము తారకరత్నతో మంచి పాత్ర చేయించాలి అని నిర్ణయం తీసుకోని రెడీ అవుతున్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది”…
నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, నందమూరి అభిమానులని, సినిమా వర్గాలని దిగ్భ్రాంతికి గురి చేసింది. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి శనివారం నాడు తుది శ్వాస విడిచిన తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. ఈ కార్యక్రమాలని నందమూరి బాలకృష్ణ అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఫ్యామిలీతో పాటు తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు తారకరత్న భౌతికకాయాన్ని…