తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తిచేసుకుని ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం.. ఒక రాజకీయ అనివార్యం.కొందరు వ్యక్తుల కోసమో.. కొందరి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ…
టీడీపీ ఆవిర్భావ వేడుకలను వివిధ దేశాల్లో జరుపుకుంటున్నారు ఎన్ఆర్ఐలు. 40 దేశాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు ఆయా దేశాల్లో స్థిరపడిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు. విదేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ పుట్టింది. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్. తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందే. పటేల్, పట్వారీ వ్యవస్థ…