రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో నదిలో అయిదుగురు భారతీయ విద్యార్థులు మునిగిపోయారు. స్థానికులు అందులో ఒకరిని రక్షించారు. నలుగురు పూర్తిగా నీటిలో ముగిని మృతి చెందారు. ఈ మృతదేహాలను వీలైనంత త్వరగా వారి బంధువులకు పంపించడానికి రష్యా అధికారులతో సమన్వయం చేస్తున్నామని దేశంలోని భారతీయ మిషన్లు శుక్రవారం వెల్లడించాయి.