మేషం :- ముఖ్యులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కుటుంబీకుల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులకు ఉచిత సలహా ఇవ్వటం వల్ల మాటపడక తప్పదు. స్థిర, చరాస్తుల విషయంలో తొందరపాటు తనం మంచిది కాదని గ్రహించండి. వృషభం :- ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. పాతమిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళుకువ అవసరం.…