టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలపై ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన ఆధారాలు బలంగా లేవని ఎక్సైజ్ శాఖ తెలిపింది. కెల్విన్ పై ఛార్జ్ షీట్ లో సినీ తారల విచారణ ప్రస్తావించిన ఎక్సైజ్ శాఖ.. ఈమేరకు సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని పేర్కొంది. సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ ప్రకారం.. ‘సిట్ బృందం పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది.…