పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాద ఘటనకు సిగిరెట్టే కారణమని అధికారులు నిర్ధారించారు. సిగరెట్, చెత్తతోనే అగ్ని ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. బీడీ, సిగరెట్ కేర్ లెస్ స్మోక్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించారు. శనివారం సాయంత్రం అత్యవసర వైద్య విభాగంలోని ఐదో అంతస్తు ఆడిటోరియంలో చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిటికీల నుంచి దట్టమైన పొగ బయటకు రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది…