TAHAWWUR RANA: 26/11 ముంబై ఉగ్రదాడి కుట్రదారు, ఉగ్రవాది తహవూర్ హుస్సేన్ రాణానికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారికంగా అరెస్ట్ చేసింది. భారత అధికారులు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి రొమేనియా మీదుగా ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఢిల్లీకి తీసుకువచ్చిన వెంటనే ఎన్ఐఏ అతడిని అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ సంవత్సరాల కృషి మూలంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని అమెరికా భారత్‌కి అప్పగించింది.