ఏపీలో రివర్స్ పీఆర్సీపై పోరాడుతున్న ఉద్యోగులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే పనిలో వున్నారు. అమరావతిలోని ఎన్జీవో హోంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల భేటీ అయ్యారు. పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను వైద్యారోగ్య శాఖలో ఏ విధంగా అమలు చేయాలన్న అంశంపై చర్చిస్తున్నారు. ఫిబ్రవరి నెల ఏడో తేదీ నుంచి వైద్యారోగ్య శాఖ సమ్మెకు వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. మిగిలిన ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం ఓ ఎత్తైతే..…