భారత రాజకీయాల్లో ఒక మాట చాలా ప్రసిద్ధి. అదేంటంటే ఢిల్లీ రహదారి లక్నో నుంచే వెళుతుంది అని. దాని ప్రకారం ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని. ఇంకో మాటలో చెప్పాలంటే యూపీని గెలవకుండా ఢిల్లీని గెలవలేరని అర్థం. ప్రజాభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్యనే ప్రధాన పోటీ. బీజేపీ జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌కు పెద్ద పాత్ర ఉండకపోవచ్చు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని…