ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవం ఒక ప్రత్యేకమైన గర్వకారణం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వేళ, దేశమంతా పతాకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో దేశభక్తి వాతావరణం నెలకొంటుంది. అయితే, కేవలం భారతదేశంలోనే కాదు.. అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా మన జాతీయ పండుగను ఘనంగా జరుపుకుంటారు. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నది న్యూయార్క్‌లో నిర్వహించే ఇండియా డే పరేడ్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుక,…