కరోనా మహహ్మరి కొత్త రూపాంతరం చెందుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కోవిడ్ కొత్త కొత్త వేరియంట్‌లతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడు దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఇజ్రాయెల్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో 14 రోజుల పాటు విదేశీయులను దేశంలోకి రాకుండా, కొత్త కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా విదేశాల నుంచి విమాన ప్రయాణాలను రద్దు ప్రకటించనుంది.…
మహమ్మారి పీడ వదిలింది అనుకునే లోపు కొత్త వేరియంట్లు హడలెత్తిస్తున్నాయి. తాజా రూపాంతరం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ కొత్త వేరియంట్ పేరు బీ. 1.1.1529. ఐతే, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. పాత వాటితో పోలిస్తే ఇది భయంకరమైంది మాత్రమే కాదు ప్రమాదకారి కూడా అన్నది శాస్త్రవేత్తల అంచనా. నవంబర్ 24న ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒమిక్రాన్ గురించి దక్షిణాఫ్రికా రిపోర్ట్ చేసింది. నవంబర్ 9న సేకరించిన…