తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్ప కూలింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు కొంత దూరంగా ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాదానికి సంబంధించి ఎలా జరిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శ్రీకారం చుట్టారు. రాజమండ్రి విమానాశ్రయ టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు.