ఇవాళ్టి రోజుకో ప్రత్యేకత ఉంది. 22.02.2022! ఎటు నుండి చూసిన ఒకటే!! అంతేకాదు… ఇవాళ దర్శకుడు తేజ పుట్టిన రోజు కూడా. ఈ సందర్భంగా డి. రామానాయుడు మనవడు, సురేశ్ బాబు రెండో కొడుకు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కిస్తున్న మూవీ టైటిల్ ను ప్రకటించారు. ‘అహింస’ అనే ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే, తేజ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమాను ప్రారంభించారు.…