Malkajgiri Crime: అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. వచ్చిన బంధువులు పెళ్లింటి నుంచి ఇంకా వెళ్లలేదు.. కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు. అంతలోనే ఘోరం. 16వ రోజుల పండక్కు పుట్టింటికి వచ్చిన పెళ్లికూతురు ఆత్మహత్య చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో నవ వధువు వసంత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసకుంది. అదనపు కట్నం, భర్త వేధింపులు భరించలేక నవ వధువు బలవన్మరణంకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో తన గది లో ఫ్యాన్ కు తాడుతో ఉరి వేసుకొని వసంత ఆత్మహత్య చేసుకుంది. వసంత తన గదిలో నుండి ఎంతకీ బయటకు రాకపోవడంతో గది తలుపులను కుటుంబ సభ్యులు బద్దలు కొట్టారు. దీంతో…