Nepal: నిరసనకారుల చర్యలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దేశం నేపాల్. ఒక ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక నిరసనలతో ఏకంగా ప్రభుత్వం రద్దు అయిన చరిత్రను నేపాల్ ప్రభుత్వం మూటగట్టుకుంది. తాజాగా నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి పదవి రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హింసాత్మక నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనరేషన్-జెడ్, దేశ మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును మొదట తెరపైకి తెచ్చింది. కానీ ఆమె పేరుపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తాత్కాలిక ప్రధానమంత్రి పదవి…
Nepal PM KP Sharma Oli Resigns: నేపాల్‌లో పరిస్థితి దిగజారుతోంది. నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖాట్మండుతో సహా అనేక ప్రాంతాల్లో నిరసన కారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. నిరసనకారులు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ వ్యక్తిగత నివాసాన్ని ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ నిరసనల నేపథ్యంలో నేపాల్ ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు.