ఏపీలో కోవిడ్ విలయం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని… ఆక్సిజన్ సరఫరా పైపులు, మాస్క్‌లు ఇవన్నీ కూడా నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించాలని అధికారులకు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు సిఎం జగన్. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని..ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులు, రెమ్‌డెసివర్ బ్లాక్ మార్కెట్ కఠిన…