India-France: భారత్ త్వరలో 26 మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. హిందూ మహా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ముప్పు పెరుగుతున్న తరుణంలో ఫ్రాన్స్ తో భారత్ ఈ ఒప్పందం చేసుకుంది. 26 రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలపై భారతదేశం, ఫ్రాన్స్ మధ్య రెండవ రౌండ్ చర్చలు సోమవారం నుంచి దాదాపు 10- 12 రోజుల పాటు ఈ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది.