టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సూపర్ విక్టరీ సాధించింది.. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినబాట పట్టనున్నారు టీడీపీ చీఫ్.. ఇక, ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..
Chandrababu And Pawan Kalya Attend NDA Meeting: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేశాయి. ప్రజలు ఏకపక్షంగా కూటమి అభ్యర్థుల్ని గెలిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉదయం 11 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు చేయనున్నారు.. తమకు మద్దతు ఇస్తే ఎన్డీఏ జాతీయ కన్వీనర్‌గా…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది.
జూలై18న ఎన్డీయే కూటమి కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి పలు పార్టీలకు ఆహ్వానాలు పంపించేందుకు ఎన్డీఏ సిద్ధమయినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఏ కూటమికి చెందని మరికొన్ని పార్టీలను ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది.