BJP Parliamentary Board Meeting: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలను ముమ్మరం చేసింది. సెప్టెంబర్ 9న జరగనున్న ఎన్నికలకు పార్టీ తరుఫున పోటీ చేయనున్న అభ్యర్థి పేరును నిర్ణయించే ప్రక్రియను ప్రారంభించింది. ఆదివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. కాషాయ దళం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్ పేర్లు…