Former Naxalite Murder: ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్య్వూ మాజీ నక్సలైట్ ప్రాణం తీసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టలో మాజీ నక్సలైట్‌ను దారుణ హత్య చేశాడు ఓ వ్యక్తి. తంగళ్లపల్లి (మం) గండిలచ్చపేటకు చెందిన బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య అనే మాజీ నక్సలైట్‌ను సంతోష్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చాడు. నరసయ్యను హత్య చేసిన తరువాత జగిత్యాల పోలీసులు లొంగిపోయాడు సంతోష్..