Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని, ఆ దేశానికి మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగి వచ్చారు. నాలుగేళ్లుగా యూకేలో అజ్ఞాతవాసంలో ఉన్న నవాజ్ మరోసారి రాజకీయాల్లో యాక్టీవ్ కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా దుబాయ్ లో గడిపిన షరీఫ్, ఈ రోజు అక్కడ నుంచి పాక్ రాజధాని ఇస్లామాబాద్ కి చేరుకున్నారు.