ఇతర దేశాల నుంచి సేకరించిన పాత క్షిపణి వ్యవస్థల స్థానంలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి భారత నావికాదళానికి ప్రాథమిక ఆయుధంగా ఉంటుందని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సోమవారం తెలిపారు.
భారత నావికాదళం 2047 నాటికి ఆత్మనిర్భర్‌గా మారుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ నేవీ డే సందర్భంగా శనివారం మీడియాతో వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ఇటీవలి సంఘటనలు మన భద్రతా అవసరాల కోసం ఇతరులపై ఆధారపడలేమని నిరూపించాయని.. ఆత్మనిర్భర్‌గా ఉండటానికి ప్రభుత్వం చాలా స్పష్టమైన మార్గదర్శకాలను అందించిందని నేవీ చీఫ్ చెప్పారు.