Back Pain: ఈ మధ్యకాలంలో చాలా మంది నడుము, మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో ముప్పై ఏళ్లు దాటని వారూ ఉండడం బాధాకరం. అయితే, జీవనఅలవాట్లు, ఉద్యోగ కారణమో, నిరంతరం గ్యాడ్జెట్స్ వాడకమో.. ఈ సమస్యకు కారణమవుతుంది. వీటితో పాటు మరికొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. అయితే.. నడుంనొప్పికి రకరకాల కారణాలే ఉండొచ్చు. ఇది తరచూ తిరగబెడుతుంటుంది కూడా.