తమిళనాడు వ్యాప్తంతా 22 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. ఇటీవల శ్రీలంక నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై నమోదైన కేసుపై ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. డ్రగ్స్ మాఫియా, స్మగ్లర్లే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. తమిళనాడులోని చెన్నై. తిరుప్పూర్, చెంగల్పట్టు, తిరుచిరాపల్లి జిల్లాల్లోని నిందితులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. లంక డ్రగ్ మాఫియా సంబంధాల గట్టును కనుక్కునేందుకు ఎన్ఐఏ ఈ రైడ్స్ నిర్వహించింది.