టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడాన్ని టీడీపీ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. ప్రభుత్వం కక్షపూరితంగానే నారాయణను అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రభుత్వం తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను ఎలా బాధ్యుడ్ని చేస్తారని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా…