యంగ్ తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాతో మనోడు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. తర్వాత జెర్సీ, గ్యాంగ్ లీడర్ ఇటీవల రిలీజ్ అయిన దేవర సినిమాలకు అనిరుద్ అందించగా ఆ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ బాగా అసెట్ అయింది. ఇప్పుడు మనోడు మరో సినిమా సైన్ చేశాడు. ఈ మేరకు తాజాగా ఆ సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.…