ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? అంటే ఔననే సమాధానం వస్తోంది. గతంలో పలు పట్టణాలు, నగరాల పేర్లు మార్చిన విధంగానే రాజధాని లక్నో పేరును కూడా మార్చబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా యోగీ పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సోమవారం సాయంత్రం లక్నోకు వచ్చిన ప్రధాని నరేంద్ మోదీని స్వాగతిస్తూ…‘‘ శేషావతారి భగవాన్ లక్ష్మణుడి పావన నగరమైన లక్నో మోదీకి స్వాగతం పలుకుతుంది’’…