ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం. ఇక్కడి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. టీఆర్ఎస్ నుంచి వరసగా రెండోసారి ఎమ్మెల్యే. 2014లో గెలిచిన తర్వాత పెద్దగా వివాదాలు రాకపోయినా.. 2018లో గెలిచాక మాత్రం పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయని కేడర్ చెవులు కొరుక్కుంటోంది. టీఆర్ఎస్ కేడర్‌తోపాటు.. ప్రజలకు ఎమ్మెల్యే దూరం అయ్యారని టాక్ నడుస్తోంది. సొంత పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా భాస్కరరావు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి టర్మ్‌లో భాస్కరరావుకు తోడుగా ఆయన…
వారిద్దరూ అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. కలిసి మెలిసి కనిపించేవారు. సడెన్‌గా ఇద్దరూ ఎడముఖం పెడముఖం. ఓ రేంజ్‌లో కోల్డ్‌వార్ ఉన్నట్టు టాక్. ఇద్దరి మధ్య ఏ విషయంలో చెడింది? ఎవరా నాయకులు? ఏమా కథ? నల్లగొండలో ఎవరికి వారే..!భూపాల్‌రెడ్డి. నల్లగొండ ఎమ్మెల్యే. గుత్తా సుఖేందర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ. ఇద్దరూ అధికార టీఆర్ఎస్ నాయకులే. నల్లగొండలో ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేందుకు వేయని ఎత్తుగడలు లేవు. దీంతో అధికారపార్టీలో కోల్డ్‌వార్ సెగలు రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి…