మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు గతంలో తమ హెయిర్ డ్రస్సర్ లక్షల విలువైన పరికరాలను దొంగిలించాడని ఆరోపిస్తూ వార్తల్లో నిలిచారు. నాగశ్రీనుపై పోలీసు కేసు కూడా పెట్టాడు. అయితే నాగశ్రీను మాత్రం తనను తాను నిర్దోషిగా పేర్కొంటూ ఒక వీడియోను విడుదల చేశాడు. అక్కడితో ఆగకుండా తనపై మంచు మోహన్ బాబు, విష్ణులు అసభ్యంగా ప్రవర్తించారని, తన కులం పేరు చెప్పి దుర్భాషలాడారని ఆరోపించారు. దీంతో నాయీబ్రాహ్మణుల సంస్థ రంగంలోకి దిగింది. Read…