రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యువ హీరో నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్‌లో 30 మంది పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టారు. ఈ కేసులో నిందితులకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుల బెయిల్ పిటిషన్ లను కొట్టివేసింది. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గుత్తా సుమన్ గత కొన్నేళ్లుగా ప్రైవేట్ క్యాసినో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పలు స్టార్ హోటళ్లు, ఫామ్ హౌస్‌లలో…
హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 30 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా నగదు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న పేకాట దందా బట్టబయలైంది. ఈ దాడుల్లో 6.75 లక్షల నగదు, 34 ఫోన్లు, ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, ఎస్‌వోటీ కలిసి జరిపిన ఈ దాడుల్లో నాగశౌర్య ఫామ్‌హౌస్ పై కూడా చెకింగ్ జరిగింది. అక్కడ గుత్తా సుమన్ కుమార్ అనే వ్యక్తి తో…