హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 30 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా నగదు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న పేకాట దందా బట్టబయలైంది. ఈ దాడుల్లో 6.75 లక్షల నగదు, 34 ఫోన్లు, ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, ఎస్‌వోటీ కలిసి జరిపిన ఈ దాడుల్లో నాగశౌర్య ఫామ్‌హౌస్ పై కూడా చెకింగ్ జరిగింది. అక్కడ గుత్తా సుమన్ కుమార్ అనే వ్యక్తి తో…