ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన కాంగోలో ఓ వింత వ్యాధి హడలెత్తిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 50 మంది మరణించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే రోగులు మరణిస్తున్నారు. గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లలలో ఈ వ్యాధి మొదట గుర్తించినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Kenya: ఆఫ్రికా దేశం కెన్యాను మాయదారి రోగం కలవరపెడుతోంది. అసలు ఏ వ్యాధి కారణంగా బాలికలు అనారోగ్యానికి గురవుతున్నారో వైద్యులకు స్పష్టంగా తెలియడం లేదు. కెన్యాలోని దాదాపుగా 100 మంది పాఠశాల బాలికలు ఆస్పత్రిలో చేరారు. అధికారులు వారి రక్తం, మూత్రం, మలం నమూనాలను నైరోబిలోని ప్రయోగశాలకు పంపారు.