Jammu Kashmir: ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జమ్మూ కాశ్మీర్‌కి చెందిన రెండు ముస్లిం కాన్ఫరెన్స్ వర్గాలపై కేంద్రం నిషేధం విధించింది. ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ (సుమ్జీ వర్గం), ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ & కాశ్మీర్ (భాట్ వర్గం)లను బుధవారం నిషేధిత గ్రూపులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో కృతనిశ్చయంతో ఉందని, ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమిత్ షా హెచ్చరించారు.