అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోనే ఉదాహరణగా ఉంది. గురువారం థాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో ట్రంప్-మస్క్ పక్కపక్కనే కూర్చుని లంచ్ చేశారు.