చూస్తే భూమికి ఐదున్నర అడుగుల ఎత్తున పీలగా కనిపిస్తాడు. కానీ, మురుగదాస్ పవర్ ఏంటో ఆయన సినిమాలే చెబుతాయి. తెలుగువారిని ‘గజిని’ అనువాదచిత్రంతో ఆకట్టుకున్న మురుగదాస్ తరువాత చిరంజీవితో ‘స్టాలిన్’ తెరకెక్కించి అలరించారు. మహేశ్ బాబుతో ‘స్పైడర్’ తీసి మురిపించారు. ఇక హిందీలోనూ తొలి చిత్రం ‘గజిని’తోనే బంపర్ హిట్ పట్టేశారు. దేశంలో తొలిసారి వంద కోట్ల క్లబ్ కు తెరతీసిన చిత్రంగా హిందీ ‘గజిని’ నిలచింది. విజయ్ హీరోగా హ్యాట్రిక్ కొట్టేశారు మురుగదాస్. గత సంవత్సరం…