Home
Municipal Elections 2026
Municipal Elections 2026 News
-
Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
కడప జిల్లా జమ్మలమడుగులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్‌కు సంబంధించి హైకోర్టు నుంచి అనుకూల ఆదేశాలు వచ్చాయి. దీంతో నేడు జమ్మలమడుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఇందిరమ్మ నిర్ణయించుకున్నారు. అయితే ఇందిరమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుండ్లకుంటలోని ఇందిరమ్మ స్వగృహం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.… -
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయి. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్న వైసీపీ.. న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం (ఈసీ)కు కూడా ఫిర్యాదు చేశారు. పుంగనూరులో చోటుచేసుకున్న పరిణామాలపై హైకోర్టును ఆశ్రయించినట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం… -
Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
Punganur Municipal Elections 2026: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పుంగనూరులో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న దౌర్జన్యాల నేపథ్యంలో ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని పెద్దిరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో పుంగనూరు పట్టణానికి రావొద్దంటూ… -
Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
Tirupati YCP Mayor Candidate Protest: తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ తన నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ తల్లితో కలిసి నిరసనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట రోడ్డుపై కూర్చొని ఆందోళన చేశారు. నామినేషన్ వేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని అధికారులను కోరారు. నామినేషన్ వేసేందుకు తన కొడుక్కి అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు వాసు యాదవ్ తల్లి అభ్యర్థన చేశారు.… -
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం నేటితో ముగియనుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. ముఖ్యంగా విజయవాడలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించేందుకు… -
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
Stone Attack on YSRCP Leaders in Punganur: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బసవరాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థుల తరఫున నామినేషన్లు దాఖలు చేసేందుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు అక్కడికి వెళ్లిన సమయంలో టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. నామినేషన్ కేంద్రానికి… -
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
AP Municipal Elections 2026 Update: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై కీలక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి జనసేన, బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకంపై తుది నిర్ణయానికి రావడమే లక్ష్యంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశానికి బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు… -
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
Off The Record: విజయవాడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది అధికార కూటమి. ఇదే సమయంలో ఆ సీటు కోసం భాగస్వామ్య పక్షాలు టిడిపి జనసేన మధ్య పోరు పీక్స్‌లో ఉంది. 2021లో వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. మొత్తం 64 డివిజన్స్కుగాను 49 చోట్ల గెలిచింది వైసీపీ. అంతకు ముందు టిడిపి ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేత మేయర్‌గా ఉన్నారు.… -
OTR: మంత్రుల మెడ మీద పొలిటికల్ కత్తి వేలాడుతోందా?.. ఫలితాల ఆధారంగా గ్రేడింగ్?
తెలంగాణ మంత్రులు కొందరి మెడ మీద పొలిటికల్ కత్తి వేలాడుతోందా?.. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు స్పెషల్ టాస్క్ ఇచ్చారా?.. ఆ లక్ష్యాన్ని ఛేదించేదాన్ని బట్టే భవిష్యత్ అవకాశాలు, ఇతర వ్యవహారాలు ఆధారపడి ఉంటాయా?.. ఏంటా కొత్త టాస్క్?.. దాని గురించి పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?. తెలంగాణ మంత్రులకు కొత్త టాస్క్ వచ్చి పడింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు. పార్టీ సింబల్‌తో సంబంధం లేకున్నా… ఆ…
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!