Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punganur Municipal Elections 2026: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పుంగనూరులో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న దౌర్జన్యాల నేపథ్యంలో ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని పెద్దిరెడ్డి అన్నారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో పుంగనూరు పట్టణానికి రావొద్దంటూ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నామినేషన్ల తొలి రోజైన ఈ నెల 16న వివిధ రాజకీయ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పట్టణంలో శాంతిభద్రతల పరిస్థితి సున్నితంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. నామినేషన్ల మూడో రోజైన ఆదివారం పుంగనూరు పట్టణానికి రావొద్దని ఎంపీ, ఎమ్మెల్యేలను పోలీసులు కోరారు. వ్యక్తులను సమీకరించి పట్టణం వైపు తీసుకొస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), 2023లోని సెక్షన్ 168 కింద పుంగనూరు పట్టణ సీఐ నోటీసులు జారీ చేశారు.
Also Read
- Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
- Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
- Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..
- World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని నోటీసుల్లో ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉండాలని పెద్దిరెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పుంగనూరులో ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు, పోలీసుల నోటీసులు, పెద్దిరెడ్డి తాజా ప్రకటనతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల ప్రక్రియ తదుపరి దశల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
-
Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
-
Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!