అమెరికాలో తుఫాన్ తాకిడితో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలబామా ప్రాంతంలో తుఫాను విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది చిన్నారులు సహా 10 మంది దుర్మరణం పాలయ్యారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో గ్రీన్‌విల్లే నగర సమీపంలోని రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనలో కనీసం 15 కార్లు చిక్కుకొన్నాయని అధికారులు తెలిపారు. ఇక్కడ వచ్చిన వరదలు, టొర్నడోలు చాలా ఇళ్లను ధ్వంసం చేశాయని అధికారులు వివరించారు. ఈ…