దేశవ్యాప్తంగా పేద ప్రజల సంఖ్య భారీగా పెరిగింది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌లో పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య పెరిగినట్లు నీతిఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పేదరికం సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది. నిరుపేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్ అగ్రస్థానంలో ఉంది. బీహార్‌లో 51.91 శాతం మంది పేదలు ఉన్నారని మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ద్వారా నీతి ఆయోగ్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్…