యూపీలో బీజేపీ నుంచి వలసలు పెరుగుతున్న వేళ రొటీన్ కి భిన్నంగా జరిగింది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అర్పనా సింగ్ త్వరలో బీజేపీ జెండా పట్టుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో సమాజ్వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు. 2017 ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున అర్పనా సింగ్ పోటీ చేశారు. ఆమె బీజేపీ అభ్యర్థి రీటా…